TSWR COE CET 2023: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల 2023కు దరఖాస్తులు ఆహ్వానం

|

Jan 27, 2023 | 9:56 PM

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి గాను 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’కు..

TSWR COE CET 2023: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల 2023కు దరఖాస్తులు ఆహ్వానం
TSTWREIS
Follow us on

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి గాను 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంగ్లీష్‌ మీడియంలో ఎంపీసీలో 575 సీట్లు, బైపీసీలో 565 సీట్లు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్లకు మొత్తం 1,140 మంది గిరిజన విద్యార్ధులను (బాలురు- 660, బాలికలు- 480) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..

మార్చి-2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లోనైతే రూ.2,00,000, గ్రామాల్లోనైతే రూ.1,50,000లకు మించకుండా ఉండాలి. ఇంగ్లిష్‌/తెలుగు మాధ్యమంలో చదివిన వారుఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి 17 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం ఇలా..

మొత్తం 160 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. క్వశ్చన్‌ పేపర్‌ తెలుగు/ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఎంపీసీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్‌ (20 మార్కులు), మ్యాథ్స్‌(60 మార్కులు), ఫిజిక్స్‌(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. బైపీసీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్‌ (20 మార్కులు), మ్యాథ్స్‌ (20 మార్కులు), ఫిజిక్స్‌(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు), బయాలజీ (40 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం

ఇవి కూడా చదవండి

ఆసక్తికలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.100లు చెల్లించాలి. ప్రవేశ పరీక్ష మార్చి 12, 2023న ఉంటుంది. హాల్‌టికెట్లు ఫిబ్రవరి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.