TG TET 2024 Notification: నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు..

TG TET 2024 Notification: నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష
TG TET 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2024 | 9:26 AM

హైదరాబాద్, నవంబర్‌ 4: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ నవంబర్‌ 2024) నోటిఫికేషన్‌ సోమవారం (నవంబర్‌ 4) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌ సర్కార్.. ఆ మేరకు ఈ ఏడాది రెండో సారి టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. ఈ ఏడాది ఇచ్చిన తొలి టెట్‌ నోటిఫికేసన్‌కు సంబంధించి మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని ఆగస్టులో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ఏడాది ఇవ్వనున్న రెండో టెట్‌కు జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే జరిగిన టెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల మంది అభ్యర్ధులు హజరయ్యారు. వారిలో 1.09 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. అయితే ఇటీవల డీఎస్‌సీ నియామక ప్రక్రియ పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టెట్‌కు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నందున కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు బుక్‌ చేసుకోవల్సి ఉంటుంది. అందువల్ల జనవరిలో సంక్రాంతికి ముందా? ఆ తర్వాతా? అన్నది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.

కాగా టెట్‌ పేపర్‌ 1 పరీక్షకు డీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు, పేపర్‌ 2కు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే వివిధ పాఠశాలల్లో ఎస్జీటీలు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలని హుకూం జారీ చేయడంతో వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు 9 సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరిలో 10వ సారి పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని 6 సార్లు టెట్‌ పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తోంది. అయితే ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్షలు జరిపినా డీఎస్సీలో అరకొర పోస్టులతో ప్రకటనలు ఇవ్వడం అభ్యర్ధులను నిరాశకు గురి చేస్తుంది. దీనిపై రాష్ట్ర సర్కార్‌ దృష్టి సారిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే