హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2024) పరీక్షలు రేపట్నుంచి (జనవరి 2) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపట్నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే టెట్ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో కూడా విద్యాశాఖ ఉంచింది. అధిక మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆయా తేదీల్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష, జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నాయి.
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు 20 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు కొన్ని ముఖ్య మార్గదర్శకాలను సూచించింది. అవేంటంటే..