TS TET 2023 Notification: తెలంగాణ టెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 నోటిఫికేషన్‌ మంగళవారం (ఆగస్టు 1) విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి అంటే బుధవారం నుంచి ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. ఫీజు చెల్లింపులకు కూడా ఆగస్టు 16వ తేదీనే చివరి తేదీగా నిర్ణయించింది. తెలంగాణ టెట్ పరీక్ష సెప్టెంబర్‌ 15వ తేదీన రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొదటి సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం..

TS TET 2023 Notification: తెలంగాణ టెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
Telangana TET 2023

Updated on: Aug 01, 2023 | 2:30 PM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 నోటిఫికేషన్‌ మంగళవారం (ఆగస్టు 1) విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి అంటే బుధవారం నుంచి ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. ఫీజు చెల్లింపులకు కూడా ఆగస్టు 16వ తేదీనే చివరి తేదీగా నిర్ణయించింది. తెలంగాణ టెట్ పరీక్ష సెప్టెంబర్‌ 15వ తేదీన రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొదటి సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక టెట్‌ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 27వ తేదీన ప్రకటించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

కాగా బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి 2023-24 విద్యాసంవత్సరానికి టెట్‌ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగోసారి టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. 2016, 2017, 2022.. ఇలా మూడు సార్లు సర్కార్‌ పరీక్ష జరిపింది. ఈ ఏడాది నాలుగోసారి టెట్‌ నిర్వహణకు ప్రకటన వెలువరించింది. ఆ తర్వాత త్వరలోనే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) జరపాలని సర్కార్‌ యోచిస్తోంది.

ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో టెట్‌ వెయిటేజీ ఉంటుంది. అందుకు అభ్యర్థులు పేపర్-1; పేపర్-2లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పేపర్‌ని బట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్‌/ యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.