EAMCET 2021: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా(బి-కేటగిరి) ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్‌మెంట్ కోటా(బి-కేటగిరి) సీట్ల భర్తీ ప్రక్రియు అక్టోబర్ 5వ తేదీ వరకు తప్పనిసరిగా కొనసాగించాలని సంబంధిత కాలేజీలను ఆదేశించింది. కొన్ని కాలేజీలు బి-కేటగిరి అడ్మిషన్లను స్వీకరించడం లేదని చాలా మంది విద్యార్థులు టీఏఎఫ్ఆర్‌సీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీఏఎఫ్ఆర్‌సీ.. సంబంధిత కాలేజీలకు వార్నింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 5వ తేదీ తరువాత మిగతా ప్రవేశాల ప్రక్రియు చేపట్టాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఒకవేళ కాలేజీల్లో దరఖాస్తులు స్వీకరించకపోతే.. తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు టీఏఎఫ్ఆర్‌సీ సూచించింది. ఆ తరువాత తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామంటూ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది.
Also read:
India vs China: గల్వాన్ వ్యాలీ ఘటనపై చైనా ఆరోపణలు.. బలంగా తిప్పికొట్టిన భారత్!