Civils Free Coaching: సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా.? అయితే శిక్షణనకు భారీగా ఫీజు అవుతుందని వెనుకడుగు వేస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సదవకాశం. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తోంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉచితం శిక్షణ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీసాట్)కు ఉచితంగా కోచింగ్ అందిచనున్నారు.
* అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు.
* అభ్యర్థులు ఎలాంటి ఉద్యోగం కానీ, ఇతర కోర్సులేవీ చదువుతూ ఉండకూడదు.
* అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 10 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tsstudycircle.co.in ను సందర్శించండి.
Also Read: UGC NET 2021: త్వరలో UGC NET అడ్మిట్ కార్డ్ విడుదల.. తాజా అప్‌డేట్ ఏంటంటే..?