TSLPRB Updates: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన విడుదల..

|

Jan 29, 2023 | 4:29 PM

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ శుభవార్త తెలిపింది. ఒకటికి మించి జవాబులు ఉన్న ప్రశ్నలకు సంబంధించి బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో..

TSLPRB Updates: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన విడుదల..
Tslprb Updates
Follow us on

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ శుభవార్త తెలిపింది. ఒకటికి మించి జవాబులు ఉన్న ప్రశ్నలకు సంబంధించి బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని పోలీసు నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుతో మరికొంత మంది అభ్యర్థులు తర్వతి స్టేజ్‌కు ఎంపికకానున్నారు. ఈ నిర్ణయంతో రాత పరీక్షలో అర్హత సాధించే మరికొంత మంది అభ్యర్థుల జాబితాను సోమవారం నుంచి అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పణకు గడువు కల్పించనున్నారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిజికల్‌ టెస్ట్‌ పరీక్షలను నిర్వహిస్తామని నియామక బోర్డ్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలో జరిగిన ప్రిలిమనరీ రాత పరీక్షల సమయంలో మల్టీ ఆన్సర్స్‌ ఉన్న ప్రశ్నలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మొత్తం 7 ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొర్లిన నేపథ్యంలో తాము అర్హత సాధించలేదని అభ్యర్థులు తమకు మార్కులు కలపాలని కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు ప్రశ్న అటెంప్ట్‌ చేసిన ప్రతీ ఒక్కరికీ మార్కులు కలపాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీస్‌ నియామక మండలి మార్కులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన వారు తమ హాల్‌ టికెట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని నియామక బోర్డ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..