CCTV Cameras at Inter Exam Centres: పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు..

|

Feb 15, 2025 | 2:27 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలంగాణ విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళికి వివరించారు. ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు..

CCTV Cameras at Inter Exam Centres: పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు..
CCTV Cameras at Inter Exam Centres
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్న పరీక్ష కేంద్రాల్లో 8 వేలకిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలంగాణ విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళికి వివరించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటర్‌ ప్రయోగ పరీక్షలపై పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, వాటిని బోర్డులోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా కఠినమైన నిఘా ఉంటుందని వివరించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన 8 వేలకి పైగా కెమెరాలను పర్యవేక్షించడానికి 40 మంది సిబ్బందితో ఓ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న సమయంలో పారదర్శకత, సమగ్రత, భద్రతను నిర్ధారించడం ఈ నిఘా వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ఈ మేరకు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, జ్యోత్స్నారెడ్డి ఫిబ్రవరి 14న పరీక్ష కేంద్రాల్లో కెమెరా వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా లీకేజీలను నివారించడానికి, పరీక్ష మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా ఏకకాలంలో పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది.

ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ పేపర్‌ 1 ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు కమషన్‌ ప్రకటనను జారీ చేసింది. కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ (పేపర్‌-1) పరీక్ష డిసెంబర్‌ 9న దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 312 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పేపర్‌ 1లో క్వాలిఫై అయిన వారికి పేపర్ 2 (డిస్క్రిప్టివ్) పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ Iలో మొత్తం 2145 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేసినట్లు కమిషన్‌ వెల్లడించింది. కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులు, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వివరాల కోసం ఈ కింద క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ పేపర్‌ 1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.