TG SET 2024 Results: ఓరి దేవుడా.. టీజీసెట్‌ 2024 ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా ఢమాల్..! కారణం ఏంటో..

|

Nov 17, 2024 | 2:09 PM

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో ఎన్నడూలేని విధంగా ఉత్తీర్ణత శాతం కనీసం 10కి కూడా చేరలేదు. మొత్తం అభ్యర్ధుల్లో కేవలం 7 శాతం మాత్రమే అర్హత సాధించడం చర్చణీయాంశంగా మారింది..

TG SET 2024 Results: ఓరి దేవుడా.. టీజీసెట్‌ 2024 ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా ఢమాల్..! కారణం ఏంటో..
TG SET 2024 Results
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 17: రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అవసరమైన టీజీసెట్‌ (తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష- 2024) ఫలితాలు శనివారం (నవంబర్‌ 16) విడుదలైన సంగతి తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌తో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకృష్టారెడ్డి నవంబరు 16న ఓయూలోని టీఎస్‌సెట్‌ కార్యాలయంలో ఈ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సెట్‌ పరీక్షకు మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షకు హాజరైన వారిలో కేవలం 1884 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే ఈ పరీక్షకు హాజరైన వారిలో 7.17 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడం చర్చణీయాంశంగా మారింది. అందులో మహిళా అభ్యర్థులు 49.79 శాతం మంది, పురుషులు 50.21 శాతం మంది అర్హత సాధించారు. తెలంగాణ సెట్‌ ఫలితాలను టీజీసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ సెట్ 2024 ఫలితల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫలితాల విడుదల సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అభినందించారు. తెలంగాణ అంతటా ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్ ఎక్సలెన్స్‌ను పెంపొందించడంలో, నాణ్యమైన బోధనా ప్రమాణాలను నిర్ధారించడంలో TGSET కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్, TG సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్‌ G నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ప్రతిభను గుర్తించడానికి తెలంగాణ సెట్‌ బెంచ్‌మార్క్‌ అని చెప్పారు. ఈ పరీక్షను సజావుగా నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ సెట్‌ పరీక్షను కళాశాలల్లో లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా నియామకం కోసం అర్హతను పొందడం కోసం పీజీ డిగ్రీలు పూర్తి చేసిన వారికి ప్రతీయేట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్నడూలేని విధంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతియేటీ ఈ పరీక్ష జరుగుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్ధులు సెట్‌ పరీక్షలో అర్హత సాధిస్తున్నారు. అయితే ఈసారి ఉత్తీర్ణత భారీగా పతనం అవడం చర్చణీయాంశంగా మారింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.