SA2 Exams 2026: బడి పిల్లలకు అలర్ట్.. ఎస్‌ఏ 2 పరీక్షల టైం టేబుల్‌ విడుదల! వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ 2) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఏ 2 పరీక్షలు ఏప్రిల్‌ 10 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు టైంటేబుల్‌ను..

SA2 Exams 2026: బడి పిల్లలకు అలర్ట్.. ఎస్‌ఏ 2 పరీక్షల టైం టేబుల్‌ విడుదల! వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే..
Telangana SA 2 exam time table

Updated on: Feb 23, 2026 | 10:14 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ 2) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఏ 2 పరీక్షలు ఏప్రిల్‌ 10 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు టైంటేబుల్‌ను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 10 నుంచి విద్యార్ధుకలు ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

అయితే ఏ రోజు పరీక్షల సమాధాన పత్రాలను ఆ రోజే మూల్యాంకనం చేసి ఎస్‌ఏ 2 మార్కుల అప్లోడ్‌ ప్రక్రియను కూడా ఏప్రిల్‌ 10 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు విద్యార్థుల మార్కులను ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని విద్యాశాఖ జిల్లా అధికారులకు సూచించింది. పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ఎస్‌ఏ 2 ఫలితాలను ఏప్రిల్‌ 23న ప్రకటించి అదే రోజు తల్లిదండ్రులు- ఉపాధ్యాయులతో పీటీఎం సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవుతాయి. ఈ క్రమంలో వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు రానున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి గానూ స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముందే ప్రకటించడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ట్రైన్, బస్సు టికెట్లు బుక్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us