TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్.. రేపే టీఎస్ పాలిసెట్ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌చేసుకోండి..
TS Polycet Results: తెలంగాణలో పాలిసెట్-2022 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు అలర్ట్. బుధవారం (జూలై 13) ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాంపల్లిలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలోని...
TS Polycet Results: తెలంగాణలో పాలిసెట్-2022 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు అలర్ట్. బుధవారం (జూలై 13) ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాంపల్లిలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలీసెట్ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో సీట్లు పొందగలరు.
జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. ఈ విధానాన్ని తొలిసారి అమలు చేస్తున్నారు. పాలిసెట్ పరీక్ష ద్వారా బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) కోర్సుల్లో కూడా పాలిసెట్ ద్వారా సీట్లు పొందవచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
* అనంతరం అటెన్షన్ టు క్యాండిడెట్స్‌లో ‘డౌన్‌లోడ్ పాలిసెట్ 2022 రిజల్ట్స్’పై క్లిక్ చేయాలి.
* వెంటనే క్యాండిడెట్ లాగిన్ పేజ్‌లోకి వెళ్తుంది.
* అక్కడ అభ్యర్థి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..