
రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. పోలీస్ శాఖకు సంబంధించి 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర సర్వీసులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
డీజీపీ కీలక ప్రకటన
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్ట్‌లతో జరిగిన సమావేశంలో ఆయన కీలక ప్రకటన చేశారు. పోలీస్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ వచ్చాక ఎన్ని నోటిఫికేషన్ వచ్చాయ్!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు పోలీసు ఉద్యోగాల భర్తీ జరిగింది. కానీ 2023 నుంచి ఉద్యోగాల భర్తీలో కస్తా జాప్యం నెలకొంది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేశారు. దీనికి తోడు పోలీస్ శాఖలో ప్రతి ఏడాది పదవి విరమణ పొంతున్న వారి సంఖ్య పెరుగడం, కొత్త సిబ్బంది నియామకం లేకపోవడంతో ఉన్న పోలీసులపై పనిభారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై భారం తగ్గించి వారి పనితీరును మెరుగు పర్చేందుకు.. శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దమైంది.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.