TS Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.. అధికారిక ప్రకటన విడుదల

తెలంగాణలో పాఠశాలలకు ఇస్తామన్న దసరా సెలవుల్ని కుదించినట్లు పలు వార్తలు వస్తున్నాయి. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ..

TS Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.. అధికారిక ప్రకటన విడుదల
Dasara Holidays

Edited By: Janardhan Veluru

Updated on: Sep 21, 2022 | 2:36 PM

Telangana Dasara Holidays 2022: తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఇస్తామన్న దసరా సెలవుల్ని కుదించినట్లు మీడియా వర్గాల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్సీఈఆర్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జూలైలో వర్షాల కారణంగా సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, ఈ సెలవు దినాలను భర్తీ చేసేందుకు దసరా సెలవులను కుదించాలని ఎస్‌సీఈఆర్‌టీ పాఠశాల విద్యాశాఖకు ప్రతపాదనలు చేసినట్లు, నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు సదరు వార్తల సారాంశం.

ఐతే సదరు వార్తలను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ తోసిపుచ్చింది.  ముందుగా ప్రకటించిన మేరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు బుధవారంనాడు ప్రకటించింది. దసరా సెలవుల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని స్పష్టంచేసింది.

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన..

Dasara Holidays

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.