Telangana Jobs: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

|

Mar 19, 2022 | 3:56 PM

Telangana Jobs: తెలంగాణలో సుమారు 81, 192 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా అలెర్ట్ అయ్యారు.

Telangana Jobs: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Follow us on

Telangana Jobs: తెలంగాణలో సుమారు 81, 192 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా అలెర్ట్ అయ్యారు. ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటనతో  అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శాఖల వారీగా ఖాళీలు సేకరించే పనిలో తలమునకలయ్యారు. కాగా తెలంగాణ (Telangana) రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాళీలను సంబంధిత శాఖ గుర్తించింది. ఇందులో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియమాకాల్లో భాగంగా టీఎస్ పీఎస్సీ (TSPSC) గ్రూప్‌-2 (Group-2) ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 100 పోస్టులను (Posts)పదోన్నతులు, కారుణ్య నియమాకాలతో పాటు 12.50 శాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించింది. అయితే రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియమాకాల కోసం అభ్యర్థులు గరిష్ఠ వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఖాళీల భర్తీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పోలీసు వంటి యూనిఫాం సర్వీసులకు మినహా ఇతర పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఓసీలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా, దానిని 44కు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు ఉండగా, దానిని 49కి, ఇక దివ్యాంగులకు 44 నుంచి 54 ఏళ్లు వయోపరిమితి పెంచనున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఆర్థిక శాఖలు, సాధారణ పరిపాలన శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించాయి. రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కనిష్ఠ వయో నిబంధనలు యదాతథంగా ఉండబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

MMRCL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ముంబై మెట్రోలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..