TS Inter Results: ఉత్కంఠకు తెర దించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌.. ఫలితాల విడుదలకు టైమ్‌ ఫిక్స్‌

|

May 08, 2023 | 8:39 AM

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరీక్షణకు ఫుల్‌ స్టాప్‌ పడే సమయం ఆసన్నమైంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంగళవారం (మే 9వ తేదీన) ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సన్నాహాలు...

TS Inter Results: ఉత్కంఠకు తెర దించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌.. ఫలితాల విడుదలకు టైమ్‌ ఫిక్స్‌
Inter Results
Follow us on

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరీక్షణకు ఫుల్‌ స్టాప్‌ పడే సమయం ఆసన్నమైంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంగళవారం (మే 9వ తేదీన) ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమైన కారణంతో రిజల్ట్స్‌ను రేపే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఫలితాల వెల్లడిపై ఆదివారం అధికారులు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.inతో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మొదట ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తెలంగాణలో పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగాయి. ఫస్ట్‌ ఇయర్‌కి 4,82,501 మంది, సెకండ్ ఇయర్‌ పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. ఇక ఆన్సర్‌ పేపర్స్‌ మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తి చేసిన అధికారులు, ఫలతాల ప్రకటనల్లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకూడదని ఒకటికి రెండు సార్లు ట్రయల్ చేసిన తర్వాత విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..