TIMS Recruitment 2021: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

|

Apr 13, 2021 | 1:18 PM

TIMS Notification 2021: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్..

TIMS Recruitment 2021: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..
Tims Jobs
Follow us on

TIMS Notification 2021: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.199 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టిమ్స్ డైరెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ పూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటి నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, డైటీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాగా, ఈ పోస్టులన్నింటినీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం https://dme.telangana.gov.in/లో అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కూడా అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.

పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు- 199
మెడికల్ ఆఫీసర్- 94
ప్రొఫెసర్- 12
అసోసియేట్ ప్రొఫెసర్- 23
అసిస్టెంట్ ప్రొఫెసర్- 22
నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- 1
అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- 6
స్టాఫ్ నర్స్- 32
డైటీషియన్- 1
ఫార్మాసిస్ట్- 8

వాక్ ఇన్ ఇంటర్వ్యూ సమయం:
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్ పోస్టులకు ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.
వయసు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు నిండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు.
ఇంటర్వ్యూ జరిగే స్థలం- తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా.

Also read:

Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

Covid Centers: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. టాప్ ప్రైవేటు ఆసుపత్రులు కూడా కోవిడ్ సెంటర్లే.. ఆదేశాలు జారీ