TS ICET 2024 Notification: తెలంగాణ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

|

Mar 06, 2024 | 2:31 PM

తెలంగాణ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ బుధవారం (మార్చి 6) విడుదలైంది. 2024-25 విద్యా సంత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 30 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు..

TS ICET 2024 Notification: తెలంగాణ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Telangana ICET 2024 Notification
Follow us on

హైదరాబాద్‌, మార్చి 6: తెలంగాణ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ బుధవారం (మార్చి 6) విడుదలైంది. 2024-25 విద్యా సంత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 30 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన విద్యార్ధులు రూ.500, ఇతరులు రూ.750 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.500 అపరాధ రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐసెట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లు మే 28 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్‌ 4, 5 తేదీల్లో ఐసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే.. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో మూడు లేదా 4 ఏళ్ల డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందేవారు బీసీఏ/ ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ /బీకాం /బీఏలో మూడు సంవత్సరాల డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్ సబ్జెక్ట్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి. మొత్తం 150 నిమిషాల వ్యవధిలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానలు రాయవల్సి ఉంటుంది. అమ్యాథమేటికల్ ఎబిలిటీ, నలిటికల్ ఎబిలిటీ, కమ్మూనికేషన్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కులు ఉండవు.

ఇవి కూడా చదవండి

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..

  • హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ
  • నిజమాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీ
  • మహబూబ్ నగర్‌లోని పాలమూరు యూనివర్శిటీ
  • హైదరాబాద్‌లోని డా. బీఆర్‌ అంబేడ్ ర్ ఓపెన్ యూనిశర్శిటీ
  • హైదరాబాద్‌లోని జవహారల్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ
  • వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ
  • నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.