TS ICET 2022 Counselling Schedule: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉన్నత విద్యామండలి (TSCHE) సోమవారం (సెప్టెంబర్ 19) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ అక్టోబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఈ ఏడాది రెండు విడతల్లో ఐసెట్ కౌన్సెలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి విడుదల చేశారు. ఐసెట్ ఫలితాలు ఆగస్టు 27న విడుదలైనప్పటికీ డిగ్రీ ఫలితాలు వెల్లడికాకపోవడంతో ఐసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం అయ్యినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలు కూడా ప్రారంభమయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ తప్ప మిగిలిన అన్ని యూనివర్సిటీలు డిగ్రీ చివరి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశాయి. రెండు, మూడు రోజుల్లో కేయూ కూడా ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ ప్రకటించనున్నట్లు లింబాద్రి తెలిపారు. అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ విడుదలకానున్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ https://icet.tsche.ac.in/లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఐసెట-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
మొదటి విడత కౌన్సెలింగ్..
చివరి విడత కౌన్సెలింగ్..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.