TS Gurukul Final Answer Key 2023: తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ తుది ఆన్సర్ కీ విడుదలకు ఏర్పాట్లు పూర్తి.. సెప్టెంబర్ నుంచి వరుసగా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 56 విభాగాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 19 రోజుల పాటు రోజుకు..

TS Gurukul Final Answer Key 2023: తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ తుది ఆన్సర్ కీ విడుదలకు ఏర్పాట్లు పూర్తి.. సెప్టెంబర్ నుంచి వరుసగా
TREIRB Gurukulam Results

Updated on: Aug 31, 2023 | 8:50 AM

హైదరాబాద్‌, ఆగస్టు 31: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 56 విభాగాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 19 రోజుల పాటు రోజుకు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. దాదాపు 4,93,727 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల విడుదల చేసింది. ఆగస్టు 26వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించిన బోర్డు తుది ఆన్సర్ కీ విడుదలకు నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది.

ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులు పరిశీలించిన అనంతరం తుది కీ విడుదల చేయనుంది. నెలాఖరుకు తుదికీ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. తుది ఆన్సర్ కీ ప్రకటించిన వెంటనే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఈ మేరకు సెప్టెంబర్ నుంచి ఒక్కొక్కరోజు ఒక్కో పోస్టుకు సంబంధించిన తుది ఆన్సర్ కీ, మార్కులు వరుసగా వెల్లడించడానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలు, ఆ తర్వాత జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తోంది. వీటి అనంతరం పీజీటీ, టీజీటీ పోస్టుల ఫలితాల విడుదలకు చేయాలని బోర్డు భావిస్తోంది.

ఇక ఫలితాలు వెల్లడించిన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేస్తుంది. ఎంపిక చేసిన అభ్యర్ధులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఐతే ఫలితాల వెల్లడికి ముందే డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌, ఫిజికల్‌ డైరెక్టర్ పోస్టులకు డెమో తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. సెప్టెంబరు నెల మొత్తం టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన వివిధ సీబీఆర్‌టీ రాతపరీక్షలు ఉండటంతో గురుకుల పరీక్షల షెడ్యూల్ ను సమీక్షించి ధ్రువీకరణపత్రాల పరిశీలన, డెమో తరగతుల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించనుంది. దీంతో నోటిఫికేషన్లో సూచించిన ధృవపత్రాలను సిద్ధం చేసుకుని ఉండవల్సిందిగా బోర్డు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.