TG Gurukul Entrance Test 2025: తెలంగాణ గురుకులాల ప్రవేశపరీక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే?

|

Jan 14, 2025 | 2:31 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి, 8వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి అన్ని గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రవేశపరీక్ష వాల్‌ పేపర్‌ను ఆయన విడుదల చేశారు..

TG Gurukul Entrance Test 2025: తెలంగాణ గురుకులాల ప్రవేశపరీక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే?
TG Gurukul Entrance Test date
Follow us on

హైదరాబాద్‌, జనవరి 14: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది కూడా. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపడతారు. తాజాగా ప్రవేశ పరీక్ష తేదీని ఎస్సీ గురుకుల సొసైటీ విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ క్రమంలో గురుకుల ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. దీనిలో భాగంగా శనివారం ప్రజాభవన్‌లో సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశపరీక్ష వాల్‌ పేపర్‌ను సైతం ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టికాహారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 40 శాతం డైట్‌ఛార్జీలు, 200 శాతం కాస్మెటిక్‌ ఛార్జీలు పెంచామని వివరించారు.

మరోవైపు తెలంగాణ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరం నుంచి గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కూడా. టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నేరుగా ఇంటర్‌లో, ఇంటర్‌ వచ్చిన మార్కుల ఆధారంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకులాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఐటీబీపీ కానిస్టేబుల్ ఈవెంట్స్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్‌లకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) పరీక్షల అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 202 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతేడాది ITBP కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదలవగా.. గత ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.

ఐటీబీపీ కానిస్టేబుల్ ఈవెంట్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.