TREIRB Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 9,231 టీచర్ ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు విడుదల.. ఏయే పోస్టులున్నాయంటే..

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషలన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (TREIRB) గురువారం (ఏప్రిల్‌ 6) ప్రకటన విడుదల..

TREIRB Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 9,231 టీచర్ ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు విడుదల.. ఏయే పోస్టులున్నాయంటే..
Telangana Gurukul Recruitment 2023

Updated on: Apr 23, 2023 | 4:58 PM

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషలన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (TREIRB) గురువారం (ఏప్రిల్‌ 6) ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్‌/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది.

టీజీటీ పోస్టులు 4,020, జూనియర్‌ కాలేజీల్లో 2008 జూనియర్‌ లెక్చరర్/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌ పోస్టులు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌ లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 12 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా మల్లయ్య భట్టు తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 17వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.