TS Dussehra Holidays 2023: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ! మొత్తం ఎన్ని రోజులంటే

|

Oct 08, 2023 | 9:31 PM

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులు, కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. దాదాపు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 14న బతుకమ్మ పండుగ రానుంది. ఇక దుర్గాష్టమి, మహర్నవమి పండుగలు అక్టోబర్ 22, 23 తేదీల్లో వస్తున్నాయి. మిగతా రెండు రోజులను ఐచ్ఛిక సెలవులు కింద ఇస్తున్నట్లు విద్యాశాఖ స్పష్టం..

TS Dussehra Holidays 2023: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ! మొత్తం ఎన్ని రోజులంటే
TS Dasara Holidays 2023
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులు, కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. దాదాపు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 14న బతుకమ్మ పండుగ రానుంది. ఇక దుర్గాష్టమి, మహర్నవమి పండుగలు అక్టోబర్ 22, 23 తేదీల్లో వస్తున్నాయి. మిగతా రెండు రోజులను ఐచ్ఛిక సెలవులు కింద ఇస్తున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు 2023-24 విద్యాసంవత్సరానికి గానూ దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 11వ తేదీ వరకు జరగనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మరో రెండు సార్లు సెలవులు రానున్నాయి. ఏడాది డిసెంబర్‌ 22 నుంచి 26వ తేదీ వరకు కూడా తెలంగాణ స్కూళ్లకు క్రిస్టమస్‌ సెలవులు రానున్నాయి. క్రిస్టమస్‌ అనంతరం సంక్రాంతి సెలవులు 5 నుంచి 6 రోజులు రానున్నాయి. ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇంటర్మీడియట్‌ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని పేర్కొన్నది.

అటు ఏపీలో అక్టోబర్‌ 14 నుంచి దసరా సెలవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో అక్టోబర్‌ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటన వెలువరించింది. అన్ని పాఠశాలల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం అక్టోబర్‌ 6వ తేదీ వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) – 2 పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. పాత పద్ధతిలోనే ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహణ అనంతరం అక్టోబర్‌ 10వ తేదీలోగా సమాదాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు ఫలితాలు అందించాలని విద్యాశాఖ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశించింది. మూల్యంకనం అనంతరం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో విద్యార్ధుల మార్కులు నమోదు చేయాలని పేర్కొంది. అక్టోబర్‌ 10వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్‌ గురించి తెలియజేయాలని చెప్పింది. ఈ ప్రక్రియ మొత్తం దసరా సెలవులకు ముందే పూర్తి చేయాలని అన్ని విద్యాసంస్థలకు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.