TS Govt Jobs: టీచర్‌ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

|

Mar 24, 2022 | 7:09 AM

TS Teacher Jobs: తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌( CM KCR) 80, 039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

TS Govt Jobs: టీచర్‌ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..
Follow us on

TS Teacher Jobs: తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌( CM KCR) 80, 039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రకటనతో నిరుద్యోగులు అలెర్ట్‌ అయ్యారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఆయా శాఖల అధికారులు కూడా ఖాళీలను గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా కేసీఆర్‌ ప్రకటించినట్లుగానే 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖకు అనుమతులు మంజూరు చేసింది. అదేవిధంగా తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ (School Education) కు అనుమతులు మంజూరు చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. అయితే.. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విద్యాశాఖకు అనుమతులు జారీ చేసింది.

మార్పులివే..

ఇక ప్రభుత్వం అనుమతులు రావడంతో ఒకటి రెండు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా టెట్ నిర్వహణ పూర్తయిన వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం కొన్ని మార్పులు, మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆదేశాల మేరకు టెట్ పేపర్- 2కు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనిర్ణయంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే SGT పోస్టులకు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత లభించనుంది. అయితే ఉద్యోగం సాధించన వారు రెండేళ్లలో ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..

CM KCR: యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ