హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం (జనవరి 4) జీవో జారీ చేసింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్‌మెంట్ కింద ఈ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ విడుదల చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చని జీవోలో తెలిపింది.
కాగా తెలంగాణ 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా వరుస నోటిఫికేషన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా పలు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇతర శాఖల్లో కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. తాజాగా ఆరోగ్య శాఖ హైదరాబాద్ నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.