పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో చివరి 15 నిమిషాల్లో మాత్రమే ‘బిట్ పేపర్’ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు టెన్త్ పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఆ పేపర్లను ఆరుకు కుదించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. అదేవిధంగా జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలను ఒకే సమయంలో కాకుండా నిర్ణీత సమయంలో విద్యార్థులకు వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొన్నారు
విద్యాశాఖ కీలక నిర్ణయాలు:
పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఈ విద్యా సంవత్సరంలో, పరీక్షలు నూటికి నూరుశాతం సిలబస్‌తో నిర్వహించబడతాయి. మల్టిపుల్ చాయిస్ బిట్ పేపర్‌ను పరీక్షా సమయం చివరి 15 నిమిషాల్లోనే విద్యార్థులకు జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జనరల్ సైన్స్ పరీక్ష రెండు పేపర్లను కలిపి ఇవ్వడానికి బదులుగా.. నిర్ణయించిన విధంగా తగిన పరీక్ష సమయంలో విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన.. పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలను చర్చించారు. ఈ ఏడాది నుంచి 10 వ తరగతి పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించాల్సి ఉండగా.. జనరల్ సైన్స్‌లో 40 మార్కులతో 2 పేపర్లు ఉంటాయి. అందులో ఒకటి ఫిజికల్ సైన్స్.. రెండవది బయోలాజికల్ సైన్స్. పరీక్ష పూర్తి చేసేందుకు 90 నిమిషాల వ్యవధితో జనరల్ సైన్స్ పేపర్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
20 నిమిషాల గ్యాప్ తర్వాత విద్యార్థులకు రెండో పేపర్ ఇవ్వనున్నారు. ఈ పరీక్షను పూర్తి చేయడానికి వ్యవధి కూడా 90 నిమిషాలు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల క్రింద.. 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సమాధానానికి 15 నిమిషాల సమయం కేటాయించారు. ఆ పదిహేను నిమిషాల్లో విద్యార్థులు పది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
త్వరలో ‘మోడల్ పేపర్లు’
ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు కేవలం ఆరు పేపర్లలోనే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, విద్యాశాఖ అధికారులు త్వరలో మోడల్ ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈసారి పరీక్షలు 6 పేపర్లతో నిర్వహించబడతాయి… ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు ఉంటాయి. అన్ని పరీక్షలు 3 గంటల సమయం.. ఒక్క జనరల్ సైన్స్ పరీక్షకు 3.20 గంటల సమయం ఇవ్వనున్నారు. విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించింది.
మరిన్ని కెరీర్ విద్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..