Telangana Schools: స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ.. లాస్ట్‌ వర్కింగ్ డే ఎప్పుడంటే..

|

Apr 01, 2022 | 7:01 AM

Telangana Schools: తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఒంటి పూట బడుల వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి ఈ కొత్త పనివేళలను...

Telangana Schools: స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ.. లాస్ట్‌ వర్కింగ్ డే ఎప్పుడంటే..
Summer Holidays
Follow us on

Telangana Schools: తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఒంటి పూట బడుల వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి ఈ కొత్త పనివేళలను అమల్లోకి తెచ్చారు. ఇక అన్ని పాఠశాలల్లో ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 23న ఫలితాలు విడుదల చేయనున్నారు. అదే రోజు పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే తొలుత ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 16 వరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా కొత్త షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలలు తిరిగి జూన్‌ 13న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.

ఇదిలా ఉంటే పదో తరగతి ఫైనల్‌ పరీక్షలు మే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా పబ్లిక్‌ పరీక్షల దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగనున్నాయి. టెన్త్‌ క్లాస్‌ వారికి బోధించే ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: AFSPA: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సాయుధ దళాల చట్టం నుంచి ఆ జిల్లాలకు మినహాయింపు..

Viral Video: వదిలే ముచ్చటే లేదు..! ఉడుతతో పంచాయితీకి దిగిన పిల్లి.. వీడియో వైరల్

PM Narendra Modi: ‘పరీక్షా పే చర్చ’ ఈ రోజే.. విద్యార్థులతో నేరుగా సంభాషించనున్న ప్రధాని మోదీ..