Viral Video: వదిలే ముచ్చటే లేదు..! ఉడుతతో పంచాయితీకి దిగిన పిల్లి.. వీడియో వైరల్

Squirrel and Cat Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి.

Viral Video: వదిలే ముచ్చటే లేదు..! ఉడుతతో పంచాయితీకి దిగిన పిల్లి.. వీడియో వైరల్
Funny Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2022 | 6:00 AM

Squirrel and Cat Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి. వీటిని చూసిన తర్వాత నెటిజన్లు నవ్వుకోవడంతోపాటు ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలను యూజర్లు బాగా ఇష్టపడుతుంటారు. సోషల్ మీడియాలో జంతువుల పోరాటానికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో వైరల్ అయింది. దీనిలో పిల్లి, ఉడుతలు ఒకదానితో ఒకటి పోరాడుతూ కనిపిస్తాయి. ఇది చూస్తే నవ్వును కంట్రోల్ చేసుకోవడం కష్టమే. ఎందుకంటే వీటి మధ్య పంచాయితీ అలా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక ఉడుత ఇంటి పైకప్పుపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో పిల్లి ఉడుతను ఎక్కకుండా అడ్డుకుంటుంది.

పిల్లి, ఉడుత పంచాయితీని మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. పిల్లి పైకి ఎక్కకుండా అడ్డుకుంటున్నప్పటికీ.. ఉడుత మాత్రం తగ్గేదెలే అంటూ ముందుకు వెళ్తుంది. కానీ పిల్లి మాత్రం ఉడుతను రాకుండా నియంత్రించడాన్ని మనం చూడవచ్చు. ఈ ఫన్నీ వీడియోను @buitengebieden_ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఫన్నీ క్యాప్షన్ కూడా రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షించగా.. చాలామంది లైక్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

వైరల్ వీడియో..

సోషల్ మీడియాలో ఈ వీడియోను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీటి పోరు చూస్తుంటే నవ్వు ఆపుకోలేక పోతున్నానంటూ ఓ యూజర్ పేర్కొనగా.. ఈ పోరాటంలో ఉడుత ఓడిపోవడానికి సిద్ధంగా లేదని మరో యూజర్ పేర్కొన్నాడు.

Also Read:

Viral Video: చిరుత పులి- బ్లాక్ పాంథర్ ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? డేంజరస్ వీడియో

Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?