TG ECET and Polycet 2024 Counselling: తెలంగాణ ఈసెట్‌, పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

|

May 26, 2024 | 7:50 AM

తెలంగాణ పాలిటెక్నిక్‌ విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు గానూ ఈసెట్‌ కౌన్సెలింగ్ తేదీలు విడుదలయ్యాయి. అలాగే పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాటీసెట్‌ ర్యాంకు ద్యారా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి రెండు సెట్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌..

TG ECET and Polycet 2024 Counselling: తెలంగాణ ఈసెట్‌, పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
TG ECET and Polycet 2024 Counselling
Follow us on

హైదరాబాద్‌, మే 26: తెలంగాణ పాలిటెక్నిక్‌ విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు గానూ ఈసెట్‌ కౌన్సెలింగ్ తేదీలు విడుదలయ్యాయి. అలాగే పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాటీసెట్‌ ర్యాంకు ద్యారా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి రెండు సెట్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తెలంగాణ ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

  • మొత్తం రెండు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. తొలిదశ కౌన్సెలింగ్‌ జూన్‌ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 11వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • తొలి విడతలో స్లాట్ బుక్‌ చేసుకున్న విద్యార్థులకు జూన్‌ 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు
  • జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది
  • జూన్‌ 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • ఈసెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్‌ జులై 15 నుంచి 25 వరకు జరుగుతుంది. జూలై 21వ తేదీన తుది విడత సీట్లను కేటాయిస్తారు
  • జూలై 21 నుంచి 23 మధ్యన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది
  • జులై 24న స్పాట్‌ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తారు
  • జులై 30వ తేదీ నాటికి స్పాట్‌ అడ్మిషన్లు పూర్తవుతాయి

తెలంగాణ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే

  • జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది
  • జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు
  • తొలివిడత సీట్ల కేటాయింపు జూన్ 30న ఉంటుంది
  • పాలీసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ జులై 7న మొదలై 16వ తేదీతో ముగుస్తుంది.
  • జులై 15 నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యా సంవత్సరం మొదలవుతుంది
  • జులై 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులు జరుగుతామి
  • జులై పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు జులై18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి
  • జులై 21 నుంచి 24 వరకు అంతర్గత స్లైడింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ విధా బ్రాంచీలు మారిన వారికీ బోధనా రుసుములు పొందేందుకు అర్హత ఉంటుంది
  • స్లైడింగ్‌ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని స్పాట్‌ ప్రవేశాల్లో చేర్చరు. ఆ సీట్లను ఆ తర్వాత సంవత్సరం లేటరల్‌ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి కేటాయిస్తారు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.