AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG Vs EAPCET 2026: ఇదేందయ్యా ఇదీ.. NEET తెల్లారే ఈఏపీసెట్‌ పరీక్ష ఎలా రాసేది?

ఇప్పటికే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను కూడా ఎన్టీయే విడుదల చేసింది. మరో పది రోజుల్లో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే సెషన్‌లో ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. అయితే ఈ పరీక్ష జరిగిన తెల్లారే తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్ష జరగనుంది. నీట్‌ పరీక్ష ముగిసిన మరుసటి రోజే అంటే మే 4 నుంచి

NEET UG Vs EAPCET 2026: ఇదేందయ్యా ఇదీ.. NEET తెల్లారే ఈఏపీసెట్‌ పరీక్ష ఎలా రాసేది?
NEET UG Vs TG EAPCET Exam Dates
Srilakshmi C
|

Updated on: Apr 19, 2026 | 6:01 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష మే 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను కూడా ఎన్టీయే విడుదల చేసింది. మరో పది రోజుల్లో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే సెషన్‌లో ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. అయితే ఈ పరీక్ష జరిగిన తెల్లారే తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్ష జరగనుంది. నీట్‌ పరీక్ష ముగిసిన మరుసటి రోజే అంటే మే 4 నుంచి అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ ఈఏపీసెట్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి. దీంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలలోని సెంటర్లకు చేరుకోవడం కష్టమవుతుంది. దీంతో విద్యార్ధులు ఒత్తిడికి గురవడం వంటి సమస్యలు తలెత్తుతన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నీట్‌(యూజీ) ప్రవేశ పరీక్ష మే 3న జాతీయంగా జరుగనున్నది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే మే 4 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్షలు జరుగనున్నాయి. నీట్‌, ఈఏపీసెట్‌ ఈ రెండు పరీక్షలకు ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు మాత్రమే హాజరవుతారు. నీట్‌ సిలబస్‌కు, ఈఏపీసెట్‌ సిలబస్‌కు కొంత వ్యత్యాసం మాత్రమే ఉంటుంది.

దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మే 3న సాయంత్రం 5గంటల వరకు పరీక్ష రాసిన విద్యార్థులు మరుసటి రోజు ఉదయం 9 గంటల్లోపు ఈఏపీసెట్‌ సెంటర్లకు చేరుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుదూర ప్రాంతాల్లో నీట్‌ పరీక్ష రాసే విద్యార్ధులు సకాలంలో ఈఏపీసెట్‌ పరీక్షకు చేరుకోవడం కష్టసాధ్యం. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు హైదరాబాద్‌లోనే ఈఏపీసెట్‌కు అధిక పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల్లో నీట్‌ పరీక్ష రాసిన వారు రాత్రికి రాత్రి వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. దీనిపై ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డికి సమాచారం అందించగా.. టీసీఎస్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌కు 90,279 మంది, ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు 2,09,868 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుములతో మే 2 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us