TG EAPCET 2025 Exam Date: జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!

|

Dec 24, 2024 | 6:51 AM

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ జనవరిలో విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ పరీక్షలను జేఈఈ పరీక్ష తర్వాతే నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధుల సన్నద్ధతకు సమయం లభించినట్లైంది..

TG EAPCET 2025 Exam Date: జనవరిలో ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!
TG EAPCET 2025 Exam Date
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది. ఇంజినీరింగ్‌ పరీక్షలు మూడు రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్‌ పరీక్షలను మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక ఈ సారి కూడా ఈఏపీసెట్‌ 2025 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ను ఈఏపీసెట్‌ 2025 పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. దీంతో ఈఏపీసెట్‌కు సంబంధించిన మొత్తం కసరత్తు పూర్తైంది. ఇక పరీక్షల షెడ్యూల్‌ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది.

దీనిపై టీసీఎస్‌ వర్గాలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుతోంది. మే రెండో వారంలో ఈఏపీసెట్‌ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే పరీక్షా తేదీలను కూడా ఖరారు చేసి, పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఈ షెడ్యూల్‌ జనవరిలో వచ్చే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలు పూర్తయ్యాకే ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

ఇక జేఈఈ మెయిన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా చూస్తే జేఈఈకి ఈఏపీసెట్‌ 2025కు మధ్య వ్యవధి 10 నుంచి 15 రోజులు మాత్రమే ఉండనుంది. మార్చి 20తో ఇంటర్‌ పరీక్షలు ముగుస్తాయి. దీంతో ఇంటర్‌ పరీక్షల అనతంరం ఈఏపీసెట్‌కు సుమారు 45 రోజుల వ్యవధి ఉండనుంది. దీంతో ప్రిపరేషన్‌కు సరిపడేంత సమయం ఇచ్చినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక మిగిలిన ప్రవేశ పరీక్షలైన ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌, ఈసెట్‌ వంటి పరీక్షలు కూడా మే నెలలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల ఎంపిక పూర్తికాగా, వీటిల్లో ఆరు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లను జనవరిలో ఖరారు చేసే అవకాం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.