TS Eamcet 2022 Counselling: తెలంగాణ ఎంసెట్‌ 2022 కౌన్సెలింగ్‌ తేదీలు విడుదల.. ఫస్ట్‌ రౌండ్‌ ఎప్పటినుంచంటే..

|

Aug 13, 2022 | 7:39 AM

తెలంగాణ ఎంసెట్‌, ఈ-సెట్‌లకు సంబంధించిన కౌన్సెల్సింగ్‌ తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ విడుదల చేసింది..

TS Eamcet 2022 Counselling: తెలంగాణ ఎంసెట్‌ 2022 కౌన్సెలింగ్‌ తేదీలు విడుదల.. ఫస్ట్‌ రౌండ్‌ ఎప్పటినుంచంటే..
Ts Eamcet 2022
Follow us on

TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్‌, ఈ-సెట్‌ ఫలితాలు శుక్రవారం (ఆగస్టు 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాల్లో విద్యార్ధులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సెట్‌ పరీక్షలో దాదాపు 90.7 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం చొప్పున ఉత్తీర్ణులయినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇక ఎంసెట్‌, ఈ-సెట్‌లకు సంబంధించిన కౌన్సెల్సింగ్‌ తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలిపింది. మొదటి విడత కోసం ఈనెల (ఆగస్టు) 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది. ఆగస్టు 23 నుంచి 30 వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని వివరించింది. సెప్టెంబరు 6న ఇంజినీరింగ్.. మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ చేపడతామని.. ఇందుకు సెప్టెంబరు 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలని తెలిపింది. సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన చేసి.. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు తీసుకుంటామని వివరించింది. రెండోవిడత సీట్లను.. అక్టోబరు 4న కేటాయిస్తామని వివరించింది. అక్టోబరు 11 నుంచి.. తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని, అక్టోబరు 17న తుదివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తామని వివరించింది. ఆక్టోబర్‌ 20న స్పాట్‌ ఆడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..
మొదటి విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. ఆగస్టు 21 నుంచి 29వరకు ఆన్‌లైన్‌ స్లాట్‌బుకింగ్‌
ఆగస్టు 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ఆప్షన్లు
సెప్టెంబర్‌ 6న ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు

రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. సెప్టెంబర్‌ 28నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌
సెప్టెంబరు 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్‌
సెప్టెంబరు 30న సర్టిఫికెట్ల పరిశీలన
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 4న రెండోవిడత సీట్ల కేటాయింపు

ఇవి కూడా చదవండి

మూడో (తుది) విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. అక్టోబరు 11 నుంచి
అక్టోబర్‌ 17న తుది విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్‌ 20న స్పాట్‌ అడ్మిషన్ల గైడ్‌లైన్స్‌ జారీ

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.