TS EAMCET 2021: కొన‌సాగుతోన్న తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది అప్లై చేసుకున్నారంటే..

TS EAMCET 2021: తెలంగాణ‌లో ఎంసెట్ అప్లికేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. శుక్ర‌వారం (మే 28) సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు మొత్తం 205102 మంది ఎంసెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు...

TS EAMCET 2021: కొన‌సాగుతోన్న తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది అప్లై చేసుకున్నారంటే..
Eamcet 2021 Telangana

Updated on: May 28, 2021 | 7:53 PM

TS EAMCET 2021: తెలంగాణ‌లో ఎంసెట్ అప్లికేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. శుక్ర‌వారం (మే 28) సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు మొత్తం 2,05,102 మంది ఎంసెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విభాగంలో 1,37,554 ద‌ర‌ఖాస్తులు రాగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌లో 67,548 మంది అప్లై చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎంసెట్ 2021 ప‌రీక్ష ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు తొలుత మే 26ను చివ‌రి తేదీగా ప్ర‌క‌టించారు.. కానీ అనంత‌రం విద్యార్థుల సౌక‌ర్యార్థం జూన్ 3 వ‌ర‌కు పొడ‌గించారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

* అభ్య‌ర్థులు ముందుగా తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలోకి వెళ్లాలి.
* అనంత‌రం హోం పేజీలో ఉన్న ఆప్లికేష‌న్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
* స్టెప్ 1లోకి వెళ్లి తొలుత ఫీజును చెల్లించాలి.
* స్టెప్ 2లో భాగంగా ఫొటో, డిజిట‌ల్ సిగ్నెచ‌ర్‌తో పాటు సంబంధిత డ్యాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి.
* మూడో స్టెప్‌లో భాగంగా అప్లికేష‌న్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఇంజినీరింగ్, మెడిక‌ల్‌ ఎంట్ర‌న్స్‌కు అప్లై చేసుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.800, ఎస్‌సీ, ఎస్టీ, పీహెచ్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఇక ఇంజ‌నీరింగ్‌తో పాటు మెడిక‌ల్ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. 1600, ఎస్‌సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించాలి.
* ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్న ఈ ప‌రీక్ష‌ను జూలై 5 నుంచి 9 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.
* రోజులో రెండు విడ‌త‌ల్లో నిర్వ‌హించ‌నున్న ఎంసెట్ 2021 ప‌రీక్ష‌లో భాగంగా తొలి విడ‌త ప‌రీక్ష ఉద‌యం 9.00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు, రెండో విడ‌త ప‌రీక్ష‌ను మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుంచి సాయంత్రం 6.00 గంటల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

Also Read: NFL Recruitment 2021: నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

Cyclones: ఏభై ఏళ్లలో 171 తుపానులు..అతి పెద్ద సైక్లోన్లు బంగాళాఖాతంలోనే..ఈ విపత్తులలో నష్టం ఎంతంటే..

KTR Tweet: బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ