Telangana EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ 2021ని విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించి.. ఫలితాలు కూడా విడుదల చేసింది. కాసేపటి క్రితమే ఫలితాలను హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి కేటాయించిన ర్యాంకులను ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తికేయ మొదటి ర్యాంకు సాధించారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట ప్రణీత్ సెకండ్ ర్యాంకును సాధించాడు. హైదరాబాద్ టోలీ చౌకికి చెందిన అబ్దుల్ మూడో ర్యాంకు పొందాడు. ఇక అగ్రికల్చర్ విషయానికొస్తే హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ మొదటి ర్యాంకు, శ్రీనిజ (హైదరాబాద్) రెండో ర్యాంకు పొందారు. ఇక ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 30న నిర్వహించనున్నారు.
* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
* చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Also Read: దేశీ నెయ్యితో ఈ 5 ఆరోగ్య సమస్యలకు చెక్..! అంతేకాదు బరువు కూడా అదుపులో ఉంటుందని మీకు తెలుసా..?
మద్యం సేవించి బ్యాటింగ్ చేశాడు.. అదరగొట్టే సెంచరీతో అజేయంగా నిలిచాడు.. చరిత్ర సృష్టించాడు..