TS TRT 2023 Last Date: తెలంగాణ టీఆర్‌టీ దరఖాస్తు గడువు పొడిగించిన విద్యాశాఖ.. ఎప్పటి వరకంటే..

|

Oct 23, 2023 | 1:43 PM

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తుల గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిని టీఆర్టీ పరీక్షలను..

TS TRT 2023 Last Date: తెలంగాణ టీఆర్‌టీ దరఖాస్తు గడువు పొడిగించిన విద్యాశాఖ.. ఎప్పటి వరకంటే..
TS TRT 2023 Last Date
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్ 23: తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తుల గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిని టీఆర్టీ పరీక్షలను పోలీంగ్‌ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదాపడిన నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలంటూ కొందరు అభ్యర్ధులు అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులు తుది గడువును అక్టోబర్ 28వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించారు. ఇప్పటి వరకు 1.38 లక్షల మంది ఫీజు చెల్లించారు. వారిలో 1.33 లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు.

దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా వేసిన పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా ఇప్పటికే సర్కార్ స్పష్టం చేసింది. ఎస్సీ/ఎస్‌టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల పాటు సడలింపు ఇచ్చింది. తాజాగా దరఖాస్తు గడువును పెంచడంతో చివరి 2 రోజుల నుంచి సర్వర్ సమస్యలతో కొంత మంది ఫీజు చెల్లించలేకపోయిన వారికి ఊరట లభించినట్లైంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 5,089 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ పోస్టులు 2575, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1739, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 611, పీఈటీ పోస్టులు 164 వరకు ఉన్నాయి. డీఎస్సీ ద్వారాఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ పోస్టులను రాత పరీక్ష ఆధారంగా భర్త చేస్తారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 160 ప్రశ్నలకు రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. మిగతా 20 మార్కులకు టెట్‌ వెయిటేజీ ఉంటుంది. పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులకు 200 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.