హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ సీపీగెట్ 2024 తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ రేపట్నుంచి (అక్టోబర్ 28) ప్రారంభం కానుంది. ఈ మేకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. తుది విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ నవంబర్ 1వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అలాగే ధ్రువపత్రాల పరిశీలన కూడా నవంబర్ 1వ తేదీనే ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 8న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోపు ఆయా కాలేజీల్లో స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలతోపాటు జేఎన్‌టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తాయనే సంగతి తెలిసిందే.
తెలంగాణ సీపీగెట్ 2024 తుది విడత కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ అయ్యింది. అక్టోబర్ 28వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 1వ తేదీతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల గడువు పూర్తవుతుంది. నవంబర్ 1 నుంచి 4వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇక ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని చోట ఉన్న టీచర్ పోస్టులను తొలగించి అవసరమున్న చోటకు మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి శనివారం (అక్టోబరు 26) ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలు పాఠశాలలను ఉన్నతీకరించిన సంగతి తెలిసిందే. అంటే ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత, ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా విద్యాశాఖ రూపకల్పన చేసింది. అలాంటి చోట్ల విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ టీచర్లను కేటాయించాలంటే పోస్టులు లేవు. అలాంటి స్కూళ్లను దృష్టిలో ఉంచుకొని ఇటీవల డీఎస్సీ 2024లో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ నేపథ్యంలో డీఈవోలు సమర్పించిన జాబితా మేరకు మొత్తం 870 ఉపాధ్యాయులను పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.