BSc Internship Credits: ఇకపై బీఎస్సీ ఇంటర్న్‌షిప్‌కు 5 క్రెడిట్లు.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం

|

Feb 18, 2025 | 11:06 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ) కోర్సులో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గతంలో దీనిని 4 క్రెడిట్లు మాత్రమే కేటాయించేవారు. తాజాగా వీటిని 5 క్రిడిట్లకు పెంచుతున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. ఈ విధానం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు అవుతుందని పేర్కొంది..

BSc Internship Credits: ఇకపై బీఎస్సీ ఇంటర్న్‌షిప్‌కు 5 క్రెడిట్లు.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం
BSc Internship Credits
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ) కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్న్‌షిప్‌కు పెంచుతూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు బీఎస్సీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌కు నాలుగు నుంచి ఐదు క్రెడిట్లు పెంచినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సెమినార్లకు రెండు క్రెడిట్లు ఉండగా.. వాటిని ఒకటికి కుదించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది. డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయాలని సంకల్పించిన ఉన్నత విద్యామండలి ఇటీవల ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్‌కే మహమూద్‌ ఆధ్వర్యంలో అన్ని వర్సిటీల్లోని విభాగాల బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎస్‌) ఛైర్మన్లతో సమావేశం నిర్వహించారు.

అయితే బీఎస్సీలో మొత్తం క్రెడిట్ల సంఖ్య గతంలో మాదిరిగానే 150 మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఎస్‌సీ బయో మెడికల్‌ కోర్సును ప్రారంభించామని, దానికి జేఎన్‌టీయూహెచ్‌లో బీఓఎస్‌ ఛైర్మన్‌ను కేటాయింమన్నారు. ఆ కోర్సును బోధించే అధ్యాపకులకు కార్యశాలలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఏపీలో నాగార్జునసాగర్‌ గురుకుల డిగ్రీ కళాశాల.. ఆ వార్తలు నమ్మొద్దంటూ ప్రిన్సిపల్‌ క్లారిటీ

నాగార్జునసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల డిగ్రీ కళాశాల (ఏపీఆర్‌డీసీ)లో రెసిడెన్షియల్‌ విధానం కొనసాగుతుందని ప్రిన్సిపల్‌ వైఎన్‌ఎస్‌ చౌదరి స్పష్టం చేవారు. ఈ కాలేజీలో రెసిడెన్షియల్‌ విధానం రద్దు చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దంటూ ఆయన ఓ ప్రకటనలో కోరారు. కళాశాలను ఉన్నత విద్యాశాఖ నిర్వహించడం ద్వారా అధ్యాపకుల కొరత తగ్గుతుందని, అవసరమైన ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, కొత్తహాస్టళ్ల నిర్మాణానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమకూరుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.