US Wellesley College Scholarship 2022: తెలంగాణ రాష్ట్ర విద్యార్ధిని శ్రీయా లక్కాప్రగడ అమెరికా అందించే స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది. దాదాపు రూ. 2.7 కోట్ల స్కాలర్‌ఫిప్ ఆఫర్ రాష్ట్ర విద్యార్ధినికి దక్కింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన శ్రీయా లక్కాప్రగడ (18) పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో చదువుకుంది. ఆతర్వాత డెల్టా కాలేజ్‌లో ఇంటర్ చదువుకుంది. డిగ్రీ ఏకంగా దేశందాటి అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం కలిగింది. శ్రీయాకు అమెరికా మసాచుసెట్స్‌లోని వెల్లెస్లీ కాలేజీ ఏకంగా 2.7 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, సైకాలజీ విభాగాల్లో 4 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్ కూడా అందించనున్నట్లు ప్రకటించింది. వెల్లెస్లీ కాలేజీలో ఎందరో ప్రముఖులు చదివిన చరిత్ర ఉంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు హిల్లరీ క్లింటన్ కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు.
‘ఈ స్కాలర్‌షిప్ సాధించడంలో డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ వివేక్ సాగర్ తనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించారని, వారి సహకారంతోనే ఇదంతా సాధించినట్లు’ శ్రీయా మీడియాకు తెలిపింది.
Growing up, Shreeya faced significant personal hurdles and was supported by her maternal family. Today, the 18-yr-old #DexterityToCollege fellow from Telangana is headed to Wellesley College in the US to study Computer Science and Psychology on a full scholarship of ₹2.7 crore. pic.twitter.com/pNcKmDxyVf
— Sharad Vivek Sagar (@SharadTalks) July 15, 2022
ఈ సందర్భంగా సీఈఓ శరద్ వివేక్ సాగర్ మాట్లాడుతూ.. వంద మంది సరైన యువకులు ముందుకొస్తే తాను దేశ రాతనే మారుస్తానన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 14 సంవత్సరాలుగా రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా తమ డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ పనిచేస్తోందన్నారు. శ్రీయా యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ సంస్థ ఇచ్చిన శిక్షణతో ఇప్పటి వరకు ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని శరద్ వివేక్ సాగర్ తెలిపారు.