TCS Recruitment 2022: రూ. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?

|

Feb 15, 2022 | 5:39 AM

TCS Off Campus Digital Hiring 2022: టీసీఎస్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ 2022 పేరుతో నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తులు పంపేందుకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

TCS Recruitment 2022: రూ. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?
Tcs Jobs
Follow us on

TCS Jobs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022 పేరుతో ఓ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ పూర్తియిన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. మీ కెరీర్ అపరిమితమైన వృద్ధికి, అసాధారణమైన అవకాశాలకు టీసీఎస్ వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2019, 2020, 2021 సంవత్సారల్లో ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్‌లు ఇందుకు అర్హులుగా పేర్కొంది. అలాగే 6 నుంచి 12 నెలల పాటు IT అనుభవం కూడా ఉండాలని పేర్కొంది.

ఎవరు అర్హులు: BE / B.Tech / ME / M.Tech / MCA/ M.Sc ఉత్తీర్ణత సాధించినవారు.

ఏ సంవత్సరంలో పాసైన వారు అర్హులు – 2019, 2020, 2021, 6 నుంచి 12 నెలల వరకు IT పని అనుభవం.

పదో తరగతి, ఇంటర్, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో ప్రతిదానిలో 70 శాతం లేదా 7 CGPA ఉండాలి. (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు)

అలాగే అభ్యర్థి నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. అంటే గ్యాప్ ఉండకూడదు. అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు కూడా ఉండకూడదు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 28 సంవత్సరాల వయసు వారై ఉండాలని టీసీఎస్ పేర్కొంది.

ఈ ఎంపిక విధానం రెండు రౌండ్లుగా నిర్వహిస్తున్నారు. మొదట రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపిక చేస్తారు.

అయితే రాత పరీక్ష మూడు విభాగాల్లో కండక్ట్ చేయనున్నారు. పార్ట్ 1లో అభ్యర్థుల అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2, పార్ట్‌ 3లలో అభ్యర్థుల వెర్బల్ ఎబిలిటీ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ కోడింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.

జీతం: అండర్ గ్రాడ్యుయేట్లకు సంత్సరానికి రూ. 7 లక్షలు కాగా, పీజీ చేసిన వరాకి ఏడాదికి రూ. 7.3 లక్షలు అందించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ:
TCS NextStep పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అందులో డిజిటల్ డ్రైవ్ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25, 2022గా ఉంది. ఈలోపే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రాత పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ 2022కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీసీఎస్‌ హెల్ప్‌డెస్క్‌కు ilp.support@tcs.com మెయిల్ పంపవచ్చు. అలాగే 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌‌కు కూడా కాల్ చేసి, సందేహాలు తీర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టీసీఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

Also Read: Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా చేసుకోండి..