ఉద్యోగ వేటలో ఉన్న వారికి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఈ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణతో పాటు ఉద్యోగ కల్పన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన వసతికల్పిస్తారు. అలాగే ఉద్యోగవకాశాలను కూడా చూపిస్తారు. ఏయే విభాగాల్లో శిక్షణ ఇస్తారు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్ స్టాలేషన్, సర్వీస్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, క్విల్డ్ బ్యాక్స్ మేకింగ్ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే వారు 8వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. కోర్సు వ్యవధి 6 నెలలు ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇకపోతే చదువు మధ్యలో ఉన్నవారు ఇందుకు అనర్హులు.
ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ – 508284 అడ్రస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డిసెంబర్ 5, 2022 ఉదయం 10 గంటలకు నేరుగా సంస్థలో హాజరు కావాలి. పూర్తి వివరాలకోసం 9133908000, 9133908111, 9133908222 నెంబర్లను సంప్రదించండి. ఇక కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్, పాస్ పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..