NEET-PG 2022 ఇంటర్న్‌షిప్‌ గడువు పెంచలేమని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు!

నీట్‌-పీజీ (NEET PG 2022) పరీక్ష రాసేందుకు వీలుగా ఇంటర్న్‌షిప్‌ గడువును (Internship deadline) పొడిగించాలని కొందరు వైద్య విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌ 5న తోసిపుచ్చింది..

NEET-PG 2022 ఇంటర్న్‌షిప్‌ గడువు పెంచలేమని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు!
Neet Pg
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2022 | 7:55 AM

Supreme Court dismisses plea seeking to extend NEET PG internship deadline: నీట్‌-పీజీ (NEET PG 2022) పరీక్ష రాసేందుకు వీలుగా ఇంటర్న్‌షిప్‌ గడువును (Internship deadline) పొడిగించాలని కొందరు వైద్య విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌ 5న తోసిపుచ్చింది. అలా చేస్తే మొత్తం విద్యా సంవత్సరానికి అంతరాయం కలుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోతారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటీ చేసిన వాదనతో న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. కొవిడ్‌ విధులు కారణంగా ఇంటర్న్‌షిప్‌ను సకాలంలో విద్యార్థులు పూర్తి చేయలేకపోయారని పిటిషనర్ల తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనతో భాటీ విభేదించారు. ‘మేలో పరీక్ష ఉంటుంది. కౌన్సెలింగ్‌ జులై మూడు లేదా నాలుగో వారంలో జరుగుతుంది. ఆగస్టు ఒకటి లేదా రెండో వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. ఒక వేళ ఇంటర్న్‌షిప్‌ గడువును జులై 31 దాకా పొడిగిస్తే.. మొత్తం విద్యా సంవత్సర ప్రణాళికకు అంతరాయం కలుగుతుందని’ ఆమె తెలిపారు. దీంతో ధర్మాసనం కూడా పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. గడువును పొడిగించలేమని స్పష్టం చేశారు.

Also Read:

Breaking: యూపీఎస్సీ ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్