Supreme Court Jobs: సుప్రీం కోర్టులో 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ స్కిల్‌ ఉంటేచాలు

|

Dec 23, 2024 | 6:09 AM

సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 241 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించి షాట్ నోటీస్‌ వెలువడింది. త్వరలోనే వివరణాత్మక నోటిపికేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు...

Supreme Court Jobs: సుప్రీం కోర్టులో 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ స్కిల్‌ ఉంటేచాలు
Supreme Court Jobs
Follow us on

న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 241జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఇప్పటికే కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 107 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు డిసెంబర్ 25, 2024వ తేదీతో ముగియనుంది.

తాజాగా విడుదలైన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్‌ ఉండాలి. నిమిషానికి 35 పదాల టైపింగ్ వేగం ఉండాలి. అలాగే అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి. వయోపరిమితి జులై 1, 2024 నాటికి కనిష్ఠంగా 18, గరిష్టంగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందిన వారు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైతే నెలకు రూ.72,040 వరకు జీతంగా చెల్లిస్తారు. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ తేదీలు, పరీక్ష తేదీలు, ఎంపిక విధానం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.