AP Inter Results 2022: మే 25 నుంచి ఏపీ ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 19 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది..

AP Inter Results 2022: మే 25 నుంచి ఏపీ ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు..
Holidays

Updated on: May 24, 2022 | 12:35 PM

AP Jr. colleges reopen date 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 19 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ రోజు జరిగిన (మే 24) మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II పరీక్షలతో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ముగిశాయి. ఇక ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిన్నటితో (మే 23) ముగిసిన విషయం తెలిసిందే. జూన్‌ 20న కాలేజీలు పునః ప్రారంభించనున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు (BIEAP) ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయిన విషయం తెలిసిందే. మే 28 వరకు మూల్యాంక ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్ ఫలితాలు జూన్‌లో వెల్లడించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి