School Final Exams 2025: ఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు వార్షిక పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే..

|

Mar 26, 2025 | 7:10 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం కూడా పూర్తి చేసి విద్యార్ధులకు ప్రొగ్రెస్ కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా..

School Final Exams 2025: ఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు వార్షిక పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే..
School Final Exams
Follow us on

అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆయా తేదీల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఇక తొమ్మిదో తరగతి విద్యార్ధులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 12.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి పరీక్షల విధానం టెన్ట్‌ పబ్లిక్‌ పరీక్షలా మాదిరి ఉంటాయి. అందువల్ల వీటి టైమింగ్స్‌లో మార్పులు ఉంటాయి. ఇక సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్‌ 19 నాటికి పూర్తి చేసి, ప్రొగ్రెస్‌ కార్డులను సిద్ధం చేసి ఏప్రిల్‌ 21వ తేదీన విద్యార్ధులకు అందిస్తారు. వాటిని తిరిగి విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 23న టీచర్లు తీసుకుని.. పైతరగతులకు పిల్లల్ని పంపించేందుకు వాటిని సమర్పిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠలలకు ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్‌ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి.

సీయూఈటీ (యూజీ) 2025 పరీక్షకు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌ (సీయూఈటీ-2025) యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్‌టీఏ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు సవరణ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 24వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఆన్‌లైన్‌ రాత పరీక్షలు 2025 మే 8వ తేదీ నుంచి 2025 జూన్‌ 01 వరకు పరీక్షలు జరగనున్నాయి. సీయూఈటీ (యూజీ) 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ (యూజీ) 2025 దరఖాస్తు సవరణకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.