పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా, వచ్చే నెల 19వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12,523 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎంటీఎస్ 11,994, హవల్దార్ 529 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
* ఎమ్‌టీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. హవల్దార్ పోస్టులకు నిర్ణీత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష, హవల్దార్ పోస్టులకు పీఈటీ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను 270 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. హవల్దార్ పోస్టులకు మాత్రం రాత పరీక్షతోపాటు శారీరక దారుఢ్య పరీక్ష కూడా నిర్వహిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 19ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఏప్రిల్ నెలలో రాత పరీక్షను నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..