SSC JE Result 2019: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూనియర్ ఇంజనీర్ పరీక్ష 2019 ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో ఫలితాలను చూసుకోవచ్చు. పేపర్-IIలో కమిషన్ సెట్ చేసిన కటాఫ్ ఆధారంగా 2532 మంది అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్‌లో, 358 మంది అభ్యర్థులు ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి అర్హత సాధించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్ పోస్టులకు SSC JE ఫలితాలు ప్రకటించింది.
SSC JE 2019 తుది ఫలితం పేపర్ I, II ఆధారంగా తయారు చేశామని తెలిపింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫలితంగా చివరకు 1152 మంది అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోసం ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులు, డిపార్ట్‌మెంట్ల కేటాయింపు శాఖల ప్రాధాన్యత మెరిట్ ఆధారంగా జరుగుతుంది.1152 అభ్యర్థుల ఖాళీలు (1008-సివిల్ ఇంజినీరింగ్, 144-ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్) కేటగిరీ వారీగా వివరాలను దృష్టిలో ఉంచుకుని నియామకం కోసం ఎంపిక చేస్తామని తెలిపారు.
ఫలితాలను ఇలా తనిఖీ చేయండి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ssc.nic.in. హోమ్‌పేజీలో ‘జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్, 2019 డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్’ లింక్‌పై క్లిక్ చేయండి. అర్హత గల అభ్యర్థుల జాబితాలో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఫలితం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్ సూచనల కోసం ప్రింటవుట్ తీసుకోండి. SSC JE ఫలితం 2019 PDF అనేది ఎవరు అర్హత సాధించారు ఎవరు అర్హత సాధించలేదని మాత్రమే తెలుస్తుంది. వివరణాత్మక మార్కులు ఫిబ్రవరి 1, 2022న తర్వాత అప్‌లోడ్ చేస్తారు. అభ్యర్థులు ఫిబ్రవరి 21, 2022న తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత మార్కులను చెక్ చేసుకోవచ్చు.