
హైదరాబాద్, డిసెంబర్ 2: భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాయుధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 25,487 పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPFs), అస్సాం రైఫిల్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(SSF) తదితరాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) ఆన్‌లైన్ రాత పరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.