SSC Chsl: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా ఏయే విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.? పరీక్షకు అర్హులు ఎవరు.? పరీక్ష విధానం ఎలా ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
* స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ పరీక్ష ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
* మొత్తం రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో మొదటిది టైర్-1 పరీక్ష దీనిని 200 మార్కులకి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఇస్తారు. టైర్-2 పరీక్షను డిస్క్రిప్టివ్ పేపర్ రూపంలో నిర్వహిస్తారు.
* పేపర్ 1 200 మార్కులకు, పేపర్ 2 100 మార్కులకు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను టైర్1, టైర్2, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 01-02-2022 మొదలుకాగా 07-03-2022తో ముగియనుంది.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లిండానికి 08-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* టైర్1 పరీక్షను 2022 మేలో నిర్వహిస్తారు. టైర్2 తేదీని ఇంకా ప్రకటించలేదు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Budget 2022: దేశానికి వెన్నెముక రైతన్న ఈ బడ్జెట్ నుంచి ఏమి కోరుకున్నాడు? నిర్మలమ్మ ఏమిచ్చారు?
వంటగదిలో ఉండే ఈ 7 పదార్థాలు అద్భుతం.. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వ్యాధులకు పరిష్కారం..