SSC CGL 2021: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 పరీక్షకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తివివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, అసిస్టెంట్/సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, డివిజినల్ అకౌంట్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, రిసెర్చ్ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్‌ట్యాక్స్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను టయర్ 1, టయర్ 2, టయర్ 3, టయర్ 4 విధానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కడప, కర్నూలు, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
* దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా 25-01-2021ని నిర్ణయించారు.
* ట్రయల్-1 కంప్యూటర్ రాతపరీక్షను 2022 ఏప్రిల్‌న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: RRR Movie: జక్కన్న మళ్లీ జలక్ ఇవ్వనున్నాడా..? ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుకోని అడ్డంకి.. వాయిదా అనివార్యమా..