SVVU Recruitment 2021: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెట 19వ తేదీ చివరి తేదీగా ప్రకటించిన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా రుగ్‌వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఆచార్య / ఎంఏ ఉత్తీర్ణత, నెట్ / స్లెట్ / సెట్‌లో
అర్హులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులుకు నెట్ / స్లెట్ / సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్టర్, ఎస్.వీ. వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి చంద్రగిరి, బైపాస్ రోడ్, తిరుపతి, 517502, చిత్తూరు అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 19వ తేదీతో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..