Konda Laxman bapuji Horticulture university: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హార్టీకల్చర్ యూనివర్సిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సిద్ధిపేట జిల్లాలో రాజీవ్‌రహదారిపై ములుగు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫకేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఫామ్ మేనేజర్ (01), ల్యాబ్ అసిస్టెంట్ (01), స్టెనోగ్రాఫర్ (01), డ్రైవర్ (02), అటెండర్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఫామ్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. హార్టికల్చర్/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 34,800 వరకు చెల్లిస్తారు.
* ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. హార్టికల్చర్/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 34,800 వరకు చెల్లిస్తారు.
* స్టెనో గ్రాఫర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,200 వరకు జీతంగా చెల్లిస్తారు.
* డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు జీతంగా నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.
* అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఏడో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 20,200 వరకు చెల్లిస్తారు.
* పైన తెలిపిన పోస్టులను అనుసరించి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 20-06-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: దొంగలుగా మారిన ఖాకీలు.. తనిఖీల పేరుతో దోపిడీలు.. నిజం తెలిసిన అధికారులు షాక్..
Drishyam’s Chinese remake: చైనీస్ భాషలోకీ రీమేక్ కానున్న సూపర్ హిట్ సినిమా..